కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు..

 కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు..

అమరావతి: 
ఆంధ్రప్రదేశ్‌ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని.మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర పడింది. 

26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి. 

పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.

ఏప్రిల్‌ 6వ తేదీన వాలంటీర్ల సేవలకు సత్కారంతో పాటు ఏప్రిల్‌ 8వ వసతి దీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు.