కారా మాస్టారు జీవితం ..సాహిత్య లోకానికి ఆదర్శం.. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్
శ్రీకాకుళం: వి న్యూస్ : నవంబర్ 03:
స్వర్గీయ కాళీపట్నం రామారావు మాస్టారు శత జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం నగరం బాపూజీ కళామందిర్లో ఆదివారం సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కదా నిలయం వ్యవస్థాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కీర్తిశేషులు కాళీపట్నం రామారావు మాస్టారు శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనేక కథలు వ్రాసి సాహిత్యములో సుస్థిరమైన స్థానం సంపాదించి శ్రీకాకుళం జిల్లా గౌరవాన్ని పెంచిన మహనీయులని, ఆయన ఆశయాలను కొనసాగింపులో భాగంగా సాహిత్య అభిమానులు ఆయన రచించినకథలను అంతర్జాలంలో పొందుపరచడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాఠకులు చదువుకొనుటకు అవకాశం కలిగిందని, కదా నిలయం అంతర్జాలం వివరాలను అందరికీ తెలియజేయాలని కోరారు. కారా మాస్టారు ఎందరో శిష్యులను కవులుగా, రచయితలుగా తయారు చేశారని, అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వర్ధమాన కవులు మంచి కథలు వ్రాయాలని కోరారు. ఈ సందర్భంగాకారా మాస్టర్ సోదరులకు శాలువాతో సన్మానించారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.

