67వ సచివాలయం సిబ్బందికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్ర పఠాలను అందచేసిన 7వవార్డ్ జనసైనికులు.

67వ సచివాలయం సిబ్బందికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్ర పఠాలను అందచేసిన 7వవార్డ్ జనసైనికులు.                  

మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 07:


 
              మధురవాడ వాంబే కాలనీ -3, 67వ సచివాలయంలో గురువారం జనసేన సీనియర్ యువ నాయకులు ఆకుల శివ ఆధ్వర్యంలో భారతదేశ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ,  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్   చిత్రపటాలను సచివాలయంలో పెట్టాలని సిబ్బందికి అందచేశారు. ఆకుల శివ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జనసైనికులు అందచేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలలో నిభందనలు ప్రకారం ఉంచాలని సచివాలయం సిబ్బంది ఇంచార్జ్ వాసు మరియు  సిబ్బంది  శ్రీ తేజ ,  లక్ష్మీపార్వతి, లక్ష్మణ్ నాయుడు, ఏఎన్ఎం కిసూచించారు. ఈ కార్యక్రమంలో రోకలి లోకేష్,  పంపాను సూర్య ప్రకాష్,  కొండాల కృష్ణమూర్తి, షేక్ ఫాతిమా, కృష్ణవేణి,  ధనలక్ష్మి, లచ్చి తదితరులు పాల్గొన్నారు.