కొమ్మాదిలో శ్రీరాముడు గుడి భూమిని అమ్మినవారిని కఠినంగా శిక్సించాలి - సిపిఐ, సిపిఎం నేతలు డిమాండ్.

కొమ్మాదిలో శ్రీరాముడు గుడి భూమిని అమ్మినవారిని కఠినంగా శిక్సించాలి - సిపిఐ, సిపిఎం నేతలు డిమాండ్.

కొమ్మాది: వి న్యూస్ :నవంబరు 3: 

కొమ్మాది సర్వే నెం 84 లో 31 సెంట్లు లేక 1500 చ "గ "లు శ్రీరాముని దేవాలయం భూమిని దొంగ పత్రాలు సృష్టించి అమ్మినవారిని గుర్తించి కఠినంగా శిక్షంచి ఆ భూమిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం అన్యాక్రాతమైన ఆ భూమిలో సిపిఐ, సిపిఎం నాయకులు కొమ్మాది గ్రామస్తులతో కలిసి నిరసన నిర్వహించారు.

ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ ఈ భూమిని రెవిన్యూ రికార్డులలో శ్రీరాముని దేవాలయం భూమిఅని స్పష్టంగా ఉన్నదని ఇటీవల 26-09-2024 న పెడగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెం 7762, 7764 /2004 రుగా ఒక్కొక్క దస్తావేజు 750 గజాలు చొప్పున రెండు దస్తావేజులు దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారని, మధురవాడలో సబ్ రిజిస్టార్ కార్యాలయం ఉండగా పెదగంట్యాడాలో చేయించవలసిన పని ఏముండని దీని వలనే అర్ధం మౌతున్నదని ఇదిగొంగపని అని, ఇందులో పాత మధురవాడ మెట్ట డోర్ నెం 3-44/41 నివాసి పోతిన లేటు అప్పారావు కుమారుడు పోతిన అప్పారావు ఉరఫ్ బుగ్గల మునసీబు మనవడు సాక్షి సంతకం కూడా ఉన్నదని అతనికి విచారిస్తే అన్ని విషయాలు బయటడతాయని పైడిరాజు తెలిపారు. ఈ విషయం భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ద్రుష్టికి వెళ్లినదని నిన్ననే విచారణ చేసి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించినట్లు పత్రికలలో వచ్చిందని సిపిఐ తరుపున కూడా ఎం ఎల్ ఏ గారికి, రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేసి ఈ భూమిని కాపాడాలని కోరుతామని పైడిరాజు తెలిపారు.


సిపిఐ, సిపిఎం ఏరియా కార్యదర్సులు వి సత్యనారాయణ, డి అప్పలరాజు లు మాట్లాడుతూ గ్రామస్తులు సహాయం లేకుండా ఇటువంటి అన్యాక్రాంతాలు జరగడానికి అవకాశం ఉండదని ఇందులో స్థానికులు ప్రమేయం కూడా ఉంటున్నట్లు నిపిస్తున్నదని విచారణ చేసి ఈ భూమిని కాపాడాలన్నారు.


ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యురాలు ఎం డి బేగం, కె కుమార్, ఎం ఎస్ పాత్రుడు, కె చిన్న, సిపిఎం నాయకుడు సియ్యాద్రి పైడితల్లి, కొమ్మాది గ్రామ టీడీపీ నాయకులు న్యాయవాది గొలగాని సన్యాసిరావు, వైసీపీ నాయకులు సియ్యాద్రి కనకరాజు గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీ నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.