వంటా వార్పూ చేసీ నిరసన నిరసన తెలిపిన భూములు కోల్పోయిన రైతులు.

వంటా వార్పూ చేసీ నిరసన నిరసన తెలిపిన భూములు కోల్పోయిన రైతులు.

కొమ్మాది : వి న్యూస్ ప్రతినిధి : జూలై 31: 

భూములు కోల్పోయిన రైతుల నిరసన దీక్షా శిబిరం బుదవారం సినిపశ్రమ ఆర్థిక సహాయంతో నిర్మించిన హుధూద్ ఇండ్ల వద్ద  కొనసాగింది. దీక్షా శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికైనా రైతులు కష్టకాలంలో చమటోడ్చి ఉపాదికి అనువుగా సాగు చేసుకున్న భూములను ఏమాత్రం నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకున్నారని తెలియ జేశారు. కనీసం మా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఇస్తామన్న ఇళ్లు ఇచ్చి అధికారులు హామిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంక పోతురాజు, ఎస్ పైడిరాజు, కే వి పి ఎస్ నాయకులు ఎస్ పైడితల్లి, కే నాగరాజు, వి దుర్గ, కుమారి, వి గణేష్, వి వెంకటప్పారావు, ఎస్ బంగార్రాజు, సిపిఎం కార్యదర్శి డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.