మౌళిక వసతుల కల్పనకు సహకరించి,7వవార్డ్ అభివృద్ధికి తోడ్పడండి. అంటూ ఎమ్మెల్యేని విజ్ఞప్తి చేసిన వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ

మౌళిక వసతుల కల్పనకు సహకరించి,7వవార్డ్ అభివృద్ధికి తోడ్పడండి. అంటూ ఎమ్మెల్యేని విజ్ఞప్తి చేసిన వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ 

మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : జులై31: 

వార్డులో సమస్యలపై భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకి వినతి పత్రం అందచేసిన 7వవార్డ్ కార్పొరేటర్  పిళ్ళా మంగమ్మ

భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావుని జీవీఎంవీ 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ , టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు  మర్యాదపూర్వకంగా కలిసి వార్డు అభివృద్ధి, సమస్యలను వివరించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ 7వ వార్డులో మౌలిక వసతుల కల్పన,వార్డులోని ముఖ్య సమస్యలను వివరించి, వినతి పత్రం అందచేశారు. మౌళిక వసతుల కల్పనకు సహకరించి 7వ వార్డ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. 

వివరాలు: లక్ష్మి దేవి గుడి నుంచి జాతీయ రహదారి 16 వరకు మరియు కృష్ణా నగర్ నుంచి  జాతీయ రహదారి 16 వరకు భరత్ నగర్ నుంచి ఎన్జిఓ'స్ కాలని వరకు వంబాయి కాలని శివాలయం నుంచి నగరంపాలెం తుఫాన్ బిల్డింగ్ వరకు రోడ్ల నిర్మాణం కోసం చంద్రంపాలెం దుర్గానగర్ నగరాంపాలెం కలానగర్ ముత్యాలమ్మ గుడి బింద్రనగర్ మొగదారమ్మ కాలని కాలువలు మరియు రోడ్ల నిర్మాణం కోసం 

టైలర్స్ కాలని శ్యామ్ నగర్ దోభి కాలనిలో కాలువలు మరియు రహదారి మరమ్మత్తుల కోసం మధురవాడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి స్వతంత్ర నగర్ పార్కు వరకు ఇరువైపులా కాలువలు మరియు రోడ్ల విస్తరణ కోసం 

వాంబే కాలనిలో శ్రీ కృష్ణ పాఠశాల నుంచి ఆర్టీసీ కాలని జంక్షన్ వరకు రహదారి పునః నిర్మాణం కోసం 7వ వార్డులో వీధి దీపాలు కోసం 7వ వార్డులో వాంబేకాలని, స్వతంత్ర నగర్ వుడా కాలని ఛంద్రంపాలెం పోర్ట్ కాలని షిప్ యార్డ్ కాలనిలో త్రాగు నీటి పంపులు కోసం ఏపీ హౌసింగ్ బోర్డులో వాటర్ ట్యాంక్ సొంపు మరియు పైప్ లైన్లు మరమ్మత్తులు కోసం

బింద్రా నగర్లో పైప్ లైన్లు కోసం ప్రియదర్శిని కాలనిలో వాటర్ ట్యాంక్ మరామాతులు కోసం స్వతంత్ర నగర్ కళనగర్ దుర్గా నగర్లో పార్కుల అభివృద్ధి కోసం బింద్రా నగర్ లో రాయల్ రెసిడెన్సీ వద్ద రహదారి నిర్మాణం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయవలసినదిగా కోరారు.సానుకూలంగా స్పందించిన గంటా శ్రీనివాస్   త్వరలోనే వార్డులో పర్యటించి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు