మౌళిక వసతుల కల్పనకు సహకరించి,5వ వార్డ్ అభివృద్ధికి తోడ్పడండి.:జీవీఎంసీ 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మరియు నూతన జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ కు వినతి పత్రం అందజేత.
మధురవాడ : వి న్యూస్ : జులై 29:
భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు, నూతన జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ లను జీవీఎంవీ 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత,టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసి వార్డు అభివృద్ధి,సమస్యలను వివరించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ హేమలత 5వ వార్డులో మౌలిక వసతుల కల్పన,వార్డులోని ముఖ్య సమస్యలను వివరించి, మెమోరాండం సమర్పించారు. మౌళిక వసతుల కల్పనకు సహకరించి 5వ వార్డ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
మెమోరాండం వివరాలు:1.సాయిరాంకాలనీ లో చేపట్టిన కల్యాణ మండపము నిర్మాణ పనులు మధ్యలోనే గత ప్రభుత్వం ఆపివేయడం జరిగిందని కావున ప్రజల అభ్యర్థనల దృష్ట్యా ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని. 2.కొమ్మది కూడలి దగ్గర మరియు మధురవాడ ఫైఓవర్ వంతెన దగ్గర సర్వీస్ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన వర్షం పడితే మోకాళ్ళు లోతు నీరు చేరి మనుషులు మరియు వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని,ఇక్కడ గతంలో చాలా సార్లు మరమ్మతులు చేపట్టినప్పటికీ మళ్ళీ అదే సమస్య పునరావృతం అవుతుంది.కావున ఇప్పటికైనా సదరు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా కోరారు. 3.బొట్టవానిపాలెం లో గతంలో సామాజిక భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది,కానీ ఇప్పటివరకు అభివృద్ధి పనులు జరగలేదు... కావున ఇప్పటికైనా తమరు స్పందించి సామాజిక భవనం నిర్మాణం చేపట్టాలని, 4.కొండవాలు ప్రాంతాలు అయిన కార్పెంటర్ కాలనీ,వికలాంగుల కాలనీ, స్వయంకృషినగర్,అయ్యప్పనగర్, వివేకానందకాలనీ, గాంధీనగర్, సద్గురు సాయినాథ్ కాలనీ, శివశక్తినగర్,శారదనగర్,సాయిరాం కాలనీ కొండ ఎగువ భాగంలో పైప్ లైన్లు వేసి ప్రజలకు త్రాగునీరు అందించి మరియు రోడ్లు, కాలువలు,మెట్ల మార్గాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆపనులకు నిధులు మంజూరు చేయాలని, 4.మారికవలస గ్రామం నుండి ఓజోన్ వేలి హుదూద్ కాలనీ కి వెల్లే మార్గం లో కల్వట్లు రోడ్లు, జాతీయరహదారి నుండి పరదేశిపాలెం కు వెళ్ళే ప్రధాన రహదారి మరమ్మతులు గురవడం వల్ల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కావున ఆ రోడ్డును నిర్మించాలని, అయోధ్యనగర్ కాలనీ మౌలిక సదుపాయాలు,స్వతంత్రనగర్ లో గల ఓపెన్ జిమ్ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణము ఏర్పాటు వీటి పరిష్కార మార్గము చూపాలని కోరారు.
5.బొట్టవానిపాలెం, నగరం పాలెం చెరువులు ఆక్రమణకు గురై వ్యర్థాలతో కలుషితం అవడం వలన అక్కడ ప్రజలు చాలా ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని కావున ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయవలసినదిగా కోరారు,రాజీవ్ గృహకల్ప జే.ఎన్.యు.ఆర్.ఎమ్. కాలనీలలో ముఖ్యంగా యుసిడి సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ త్వరలోనే వార్డులో పర్యటించి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

