పురోహితులకు తగిన గౌరవ మర్యాదలు లభించడం లేదని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆవేదన
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : జూలై 31:
లోకా సమస్త సుఖినోభవంతు అనుక్షణం తపించే పురోహితులకు తగిన గౌరవ మర్యాదలు లభించడం లేదని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది.బుధవారం మధురవాడ శిల్పారామంలో సమాఖ్య అభ్యున్నతి కొరకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం అత్యంత నియమ నిష్టలతో నిర్వహించారు.అనంతరం వందలాదిగా హాజరైన పురోహితులు, అర్చకులతో పురోహిత బ్రహ్మ యజ్ఞ సభ నిర్వహించి నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గం, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులకు ప్రముఖుల సమక్షంలో నియామకపత్రాలు అందచేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా విశేష సేవలందించిన పలువురు పురోహితులను విప్ర సేవక్ పురస్కారాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం భవిష్యత్ కార్యచరణపై ప్రణాళికలు రూపొందించారు. తెన్నేటి విద్యాధరశాస్త్రి సభాధ్యక్షునిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి, అధ్యక్షుడు నారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి దుర్గ బాబు, అధికారప్రతినిధి రవి, కోశాధికారి మణిశంకర్,ప్రచార కార్యదర్శి ఉమామహేశ్వ శర్మ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ శర్మ, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు సత్య శ్రీనివాస్ శర్మ జిల్లా కార్యదర్శి ఏలూరి వెంకట రమణ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

