భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇస్తామన్నా ఇల్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తారా: సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇస్తామన్నా ఇల్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తారా: సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన 

మధురవాడ : వి న్యూస్ :  జూలై 20: 

భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇస్తామన్నా ఇల్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తారా అని కొమ్మది, బక్కన్నపాలెం, రేవళ్ళు పాలెం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వారి భూముల్లో నిర్మించిన ఎన్టీఆర్ హుదూద్ ఇళ్ల వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం  రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఇది చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, రెవెన్యూ వాళ్లు నిర్లక్ష్య చర్యలకు నిరసనగా ఇళ్లకు తాళాలు వేసారు.ఈ  సందర్భంగా పెద్దలు బి పోతూ రాజు,ఎస్ పైడిరాజు మాట్లాడుతూ అమాయకులు, పేదలు అయినా రైతులను దగా చేశారని అన్నారు. మా భూముల్లో నిర్మించిన ఇల్లు మాకు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఇంతవరకు ఇల్లు అప్పగించలేదని అన్నారు. సిపిఎం నాయకులు డి అప్పలరాజు మాట్లాడుతూ భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇల్లు ఇచ్చేవరకు ఆగృహ సముదాయంలో ఎవరికి కేటాయించబోమని, రైతులకు ఇచ్చాకే కేటాయిస్తామని, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్  ప్రాజెక్ట్ డైరెక్టర్, కలెక్టర్ హామీ ఇచ్చారని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారని తెలియజేశారు. హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాకు ఇల్లు ఇవ్వకుండా వేరే ప్రాంతాల్లో వారికి కేటాయించారని ఇది అన్యాయమని అన్నారు.ఇప్పటికైనా రైతులకు ఇస్తామన్నా ఇల్లు ముందు ఇచ్చీ గృహ సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఎస్ పైడితల్లి, కె నాగరాజు, ఎస్ అక్కయ్యమ్మ, ఎస్ అప్పారావు, కనకరాజు, వెంకట అప్పారావు,రైతులు తదితరులు పాల్గొన్నారు.