జివిఎంసి నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

జివిఎంసి నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

విశాఖపట్నం: పెన్ షాట్ ప్రతినిధి: జూలై 23:-   


                                                                                      మహా విశాఖపట్నం నగర ప్రజల ఆకాంక్షకు, నగర అభివృద్ధికి అనుగుణంగా పనిచేస్తానని జివిఎంసి నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. మంగళవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాంబర్లో నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

 ముందుగా కమీషనర్ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందించారు.   ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ కు కమిషనర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నగరం ఎంతో సుందరమైనదని, ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులని, 25 లక్షల జనాభా కలిగిన మహా విశాఖ నగరానికి జివిఎంసి కమిషనర్ గా నాకు మంచి అవకాశం వచ్చిందని, దీనిని నేను సద్వినియోగం చేసుకుంటానని, ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయము చేసుకొని పని చేస్తానని తెలిపారు. స్వచ్చ ఆంధ్రా కార్పొరేషన్ మిషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో విశాఖ నగరంలో పర్యటించడం జరిగినదని, నగరంలో లెగసీ వేస్ట్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతూ, స్వచ్ఛ సర్వేక్షన్ లో విశాఖ నగరాన్ని మొదటి ర్యాంకులో నిలిచే విధంగా కృషి చేస్తానని తెలిపారు. విశాఖ సమస్యలు ఒక్కొక్కటి తెలుసుకొని వాటిని ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను ముందుగా తెలుసుకొని వాటిని పూర్తి చేసేలా కృషి చేస్తానని, విశాఖ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, తనకున్న ఒకే ఒక లక్ష్యం రెస్పాన్స్ సివిక్ బాడిగా విశాఖ నగర మార్పుకు 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకుని పనులను పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగులు, అధికారులను క్రమశిక్షణతో నడిపిస్తానని ప్రతి నెలలో రెండు, మూడు రోజులు ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించి ఉద్యోగులకు సమయం కేటాయిస్తానని, వారి సమస్యలను వీలైనంతవరకు వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతి సమస్యను, మీడియా యొక్క ఫీడ్ బ్యాక్ ను తెలుసుకుంటానని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పూర్తి సమాచారం అందేలా చూస్తానని కమీషనర్ తెలిపారు.

        అనంతరం జివిఎంసి డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, పలువురు కార్పోరేటర్లు, జివిఎంసి ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పత్రికా ప్రతినిధులు కమీషనర్ ను కలసి పుష్ప గుచ్చాలను అందించారు.