శాకంబరీదేవిగా దర్శనమిచ్చిన విజయ దుర్గాదేవి అమ్మవారు

శాకంబరీదేవిగా  దర్శనమిచ్చిన విజయ దుర్గాదేవి అమ్మవారు 

మధురవాడ : వి న్యూస్ :  జూలై 19: 

విశాఖలోని మధురవాడ,ట్రైలర్స్ కొలనీలో గల శ్రీ విజయ దుర్గాదేవి  అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ రకాలైన పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేశారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణం అంత వివిధ కూరగాయలతో అలంకరణ చేశారు.కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారుచేసి భక్తులకు వితరణ చేశారు. లోకం సస్యశ్యామలంగా, పాడిపంటలతో ఉండడానికి, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు. శుక్రవారం కావడంతో శాకంబరీ దేవిగా దర్శనమిచ్చిన విజయదుర్గా దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.ఆలయదర్మ కర్త బంగారు లక్ష్మి ఆధ్వర్యంలోని ఆలయ ప్రధానార్చకులు శ్రీకాంత్ శర్మ  అమ్మవారికి పంచామృతాలు, నారికేల, పసుపు, కుంకుమ సుగంధ ద్రవ్య జలాలతో అభిషేకం జరిపించారు తదుపరి నూతన వస్త్రాలు, వివిధ కూరగాయలుతో, పండ్లుతో పూలమాలలుతో విశేషంగా  అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.