పాత డైరీఫార్మ్ వైపు ఇరువైపులా బడ్డీలు ప్రమాదాలు బారిన పడుతున్న వాహనదారులు.
విశాఖ : పెన్ షాట్ ప్రతినిధి : జూలై 19:
విశాఖ పాతడైరీఫారం నుండి ఆదర్శనగర్ వెళ్ళే మార్గం వద్ద ఇరువైపులా దుకాణాలు అధికమవ్వటంతో వాహదారులకు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్డీ దుకాణాలు ఉండగా మరల దుకాణాల ముందు తోపుడు బళ్ళు పెడుతూ రహదారులను అక్రమిస్తున్న సరే జీవీఎంసి అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది
చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం అంటు స్థానికులు మండిపడుతున్నారు. దుకాణ యజమానులు రహదారులను అక్రమించుకోవడం వలన జాతీయ రహదారి నుండి ఆదర్శ్ నగర్ కు వెళ్ళే వాహనదారులు ప్రమాదాలకు గురవుతాయని వారు వాపోతున్నారు.

