జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విశాఖ అమ్మాయి ఈమంది జ్ఞానేశ్వరి ఎంపిక:

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విశాఖ అమ్మాయి ఈమంది జ్ఞానేశ్వరి ఎంపిక:

మధురవాడ : వి న్యూస్  : జనవరి 01 : 

30 వ తారీఖున విశాఖపట్నం లోని రైల్వే అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ మీట్ లో మధురవాడ కు చెందిన జ్ఞానేశ్వరి పాల్గొని లాంగ్ జంప్ అండర్ -16 విభాగం లో అత్యుతమ ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించింది. జ్ఞానేశ్వరి ఎన్ఐఎస్ కోచ్ ఐ.చరణ్ దగ్గర లాంగ్ జంప్ లో శిక్షణ పొందుతుంది.బంగారు పతకం సాధించిన జ్ఞానేశ్వరి ఫిబ్రవరి లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటుందని ఎన్ఐఎస్ కోచ్ ఐ. చరణ్ తెలియచేసాడు. జ్ఞానేశ్వరి ని విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి నారాయణ రావు మరియు అంతర్జాతీయ క్రీడాకారిణి హెచ్ ఎమ్ జ్యోతి , అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ ఒలింపిన్ మాణిక్యాలరావు, ప్రత్యేకంగా అభినందించారు. జ్ఞానేశ్వరి కు తల్లి దండ్రులు నారాయణరావు, దుర్గా గౌరీ లు ఎంతో ప్రోత్సహం ని ఇచ్చారని కోచ్ ఐ. చరణ్ తెలిపారు. జాతీయ స్థాయి లాంగ్ జంప్ లో పతకమే లక్ష్యం గ శిక్షణ కొనసాగిస్తానని కోచ్ ఐ. చరణ్ తెలిపాడు