10వ తరగతి విద్యార్థులకు 870 పుస్తకాలు 1,60,000 వేల రూపాయిల విలువగల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.
చంద్రంపాలెం:
జీవీఎంసీ జోన్ టు పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి చదువుతున్న 865 మంది తెలుగు మరియు ఇంగ్లిష్ మీడియo చదువుతున్న విద్యార్థులకు ఆర్ వి ఆర్ రఘు గ్రూప్ సహకారం తో 10వ తరగతి విద్యార్థులకు 870 పుస్తకాలు 1,60,000 వేల రూపాయిల విలువగల స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నార్త్ ఏసీపీ చుక్క శ్రీనివాసరావు, రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ బుడుమూరి మీనా, పాఠశాల కమిటీ సభ్యులు పిళ్ళా సూరిబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

