ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మంజుల పత్తిపాటి కవిత...
యాదాద్రి:
మన ఆకాశవాణి:!రైతన్నలకు వ్యవసాయంలో మెలుకువలు చెబుతూ
అధిక దిగుబడికి దోహదపడిన నేస్తం రేడియో..!
కమ్మని కబుర్లు చెప్పే నెచ్చెలి రేడియో..!
పసందైన మాటలతో మైమరపించే
సొగసరి రేడియో..!
సుఖదుఃఖాలలో.పాలుపంచుకునే నేస్తం రేడియో..!
కలత చెందిన మనస్సులకు ఓదార్చే తోడు
రేడియో..!
బాల బాలికలకు జ్ఞానాన్ని అందించే సరస్వతి పత్రిక రేడియో..!
కబుర్లు చెబుతూనే పనులు చేయించుకునే గడసరి రేడియో..!
మాటలతో పాటలతో స్వాతంత్ర కాంక్షను రగిలించి
బ్రిటిష్‌వారికి ముచ్చెమటలు పట్టించిన గడసరి రేడియో..!
రాత్రి పసందైన పాటలతో ఆనందపరిచి నిద్రపుచ్చే
గాన కోకిల రేడియో..!
ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా
ప్రపంచ నలుమూలల ఉన్న రేడియో అభిమానులకు
ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. తెలిపిన
మంజుల పత్తిపాటి ( కవయిత్రి).ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.బ్రాహ్మణ సేవా వాహిని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు

