మున్సిపల్ కార్మికులు మారికవలస లో భిక్షాటన.

మున్సిపల్ కార్మికులు మారికవలస లో భిక్షాటన..

మారికవలస : వి న్యూస్  : జనవరి 01 : 

మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ  రోజుకు చేరుకుంది.ఈసందర్భంగా జీ వి ఎం సి 5వ వార్డు రాజీవ్ గృహ కల్ప కాలనీ లో సోమవారం భిక్షాటన చేస్తూ నిరసన తెలియ జేశారు.ఈ సందర్భంగా

మున్సిపల్ యూనియన్ (సీ ఐ టి యు)వార్డు అధ్యక్ష, కార్యధర్షులు జీ విజయ్,కే పైడి రాజు మాట్లాడుతూ సమ్మె మొదలు పెట్టి నేటికీ ఏడు రోజులు అయిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. కార్మికులను,ప్రజలకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారం చేయ వలసిన ప్రభుత్వం,కష్టాలు పడుతున్న కార్మికులపై మొండిగా వ్యవహరిస్తోంది అని ఆవేదన వ్యక్తంచేశారు.పోలీసులను పెట్టీ నిర్బంధించి ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.పోటీ కార్మికుల ను పెట్టీ మా పనులు చేయించాలని ప్రయత్నించడం జరిగింది కాదని హితవు చెప్పారు.వెంటనే జగన్ మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేసి సమ్మె విరమించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టీ యు జోన్ నాయకులు జీ కిరణ్, డీ అప్పలరాజు, యూనియన్ నాయకులు ఎం సుశీలమ్మ,జీ శ్రీను,ఎస్ రాజు,భవాని,వి సంధ్య తదితరులు పాల్గొన్నారు.