*Breaking news*
*70 వార్డ్ లో వైఎస్ఆర్సీపీ కేడెర్ రాజీనామా లేఖ*
గాజువాక: వి న్యూస్ : డిసెంబర్ 31:
ప్రజా నాయుకులు తిప్పల దేవన్ రెడ్డి కి నమస్కరించి వ్రాయునది ఏమనగా.....గాజువాక నియోజకవర్గం 70వార్డ్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వార్డ్ ప్రధాన కార్యదర్శి మరియు బి సి సెల్ ప్రెసిడెంట్ కురిటి వెంకట సూర్య బాబు మరియు సుమారు 100 మంది కార్యకర్తలు రాస్తున్న విన్నపం...
మేము గాజువాక నియోజకవర్గం లో గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి గాజువాక నియోజకవర్గంలో పార్టీకి కష్టపడుతూ పనిచేస్తున్నాము
గాజువాక నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా మరికొన్ని అనువాద కారణాల వలన వైఎస్ఆర్సిపి పార్టీ మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాము కనుక మా యొక్క రాజీనామా లేఖను ఆమోదించవలసిందిగా తిప్పల దేవన్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు....

