మారికవలసలో 5వ వార్డ్ జనసేన అధ్యక్షుడు దేవర శివ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

మారికవలసలో 5వ వార్డ్ జనసేన అధ్యక్షుడు దేవర శివ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ.

విశాఖ భీమిలి : మారికవలస: వి న్యూస్ : డిసెంబర్ 31

జీవీఎంసీ జోన్ టు మారికావలస శారదా నగర్ కాలనీలో 5వ వార్డ్ జనసేన అధ్యక్షుడు దేవర. శివ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భీమిలి జనసేన సమన్వయకర్త డా. సందీప్ పంచకర్ల విచ్చేసి జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సందీప్ మాట్లాడుతూ 

రాబోయే రోజుల్లో టిడిపి జనసేన కుటమీతో మారికవలస శారద నగర్లో ఉన్న నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సందీప్ చెప్పడం జరిగింది.అలాగే భీమిలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేసి మన బంగారు భీమిలిగా మనందరి భీమిలి గ మారుస్తాం

జనసేన టీడీపీ కూటమితో వైసీపీ పార్టీ లో వణుకు పుడుతుంది.

అలాగే జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విషయాలు విమర్శించడం సబబు కాదని అన్నారు.

మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలపై పెట్టే దృష్టి ప్రజల సమస్యల మీద పెడితే మంచిది.

మీరు ఇప్పటికే 35 వేల కోట్ల రూపాయలు ఇళ్ల స్కాములు చేశారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు అని చెప్పి 35 వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దేశ 

ప్రధాని నరేంద్ర మోడీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.

పవన్ కళ్యాణ్  ప్రతి సారి ప్రజా సమస్యలపై ,ప్రజా ధనాన్ని మీరు ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఆ అంశాల పైన మాత్రమే మాట్లాడుతుంటే వాటికి సమాధానం చెప్పలేక ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్  వ్యక్తిగత విషయాల పైన మాట్లాడుతున్నారు.

అలాగే భూ కబ్జాదారులను భీమిలి నుంచి తరిమికొట్టే లాగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.