శ్రేయోభిలాషుల మధ్య చతురానంద్ పుట్టినరోజు వేడుకలు
మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 28:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు,పీఎం పాలెం శిష్టకరణాల సేవా సంఘం అధ్యక్షుడు లయన్ డొంకాడ అనిల్ కుమార్, వసంత దంపతుల కుమారుడు సాయి చతురానంద్ పుట్టినరోజు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య గురువారం సందడిగా నిర్వహించారు. మహావిశాఖ 6 వ వార్డు పరిధి పీఎం పాలెం లో గల శిష్టకరణాల కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూషా పట్నాయక్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనిల్, వసంత దంపతులు వారి పిల్లలకు చిన్నతనం లోనే మంచి క్రమశిక్షణ, విద్యాబుద్ధులతో పాటు భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నారని అన్నారు. అనంతరం బంధువుల సమక్షంలో కేక్ కట్ చేయించి చతురానంద్ ను ఆశీర్వదించారు. కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ సంఘం ప్రధాన కార్యదర్శి ఆరికతోట చంద్రమౌళి, రాష్ట్ర శిష్ట కరణ సంఘ నాయకులు శివ మాస్టారు, ఎన్ ఎం రావు, జయతి గోపి పట్నాయక్, డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, దధిరావు సుభాషిని, మండవకురిటి లక్ష్మి, మధురవాడ జోన్ ఉపాధ్యక్షులు బగ్గాం అప్పలనారాయణ తదితరులు చిన్నారి సాయి చతురానంద్ ను ఆశీర్వదించి భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

