మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు మోకాళ్ళపై నిరసన.

మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు మోకాళ్ళపై నిరసన.

మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 28:

రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు మోకాళ్ళపై నిల్చుని నిరసన కార్యక్రమం మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద బుధవారం చేపట్టారు.మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె రెండో రోజు కు చేరుకుంది.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎం వి ప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అన్యాయం చేశారని అన్నారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ప్రాతిపదికన పర్మినెంట్ చేస్తామని చెప్పి చేయకుండా అన్యాయం చేశారని అన్నారు.

అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్.క్లాప్ వాహన డ్రైవర్లకు 1850 రూపాయల ఇవ్వాలని కోరారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించిన ప్రభుత్వం కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని  కోరారు.మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్ శేషుబాబు, జీ కిరణ్, బి నర్సింగరావు, క్లాప్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు కే సన్ని,ఎస్ చిన్న,ఏ అశోక్, సిఐటీయు నాయకులు డి అప్పలరాజు.

పాల్గొన్నారు.