జోన్2 మధురవాడ పారిశుధ్య కార్మికులు అరెస్టు విడుదల..
మధురవాడ: వి న్యూస్ : డిసెంబర్ 31:
జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ఆదివారం నగరంపాలెం రహదారి లో కంఫర్ట్ బిన్ వాహనాలు పోలీసులతో నిర్బంధించి తీసుకెళ్లి ప్రయత్నం చెయ్యగా కార్మికులు అడ్డుకున్నారు. కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. సందర్భంగా సిఐటియు జోన్ కార్యదర్శి రాజ్ కుమార్, సురిడమ్మ అస్వస్థతకు గురయ్యారు. మొత్తం యెనిమిది మందిని అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తు పై విడుదల చేశారు.అరెస్ట్ అయిన వారి లో యూనియన్ నాయకులు ఎస్ రామప్పడు, జి కిరణ్, కార్యకర్తలు బి నర్సింగరావు, బి త్రినాధ్, చిన్న,వై ఆనంద్,ఎస్ పోతురాజు,దీనికి ముందు నగరం రోడ్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో టిడిపి నాయకులు వాండ్రాసి అప్పలరాజు, నాగోతీ సత్యనారాయణ, కానూరు అచ్యుతరావు, వాండ్రాసి రవికుమార్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనులు వెలకట్టలేని వని కొనియాడారు.ప్రభుత్వం నిత్యవసరం సరుకుల ధరలు పెంచుకుంటూ పోతుందని సామాన్య ప్రజలు జీవించిన కష్టంగా మారిందని అన్నారు. ఈ క్రమంలో కార్మికులకు వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి కార్మికుల సమ్మెను విరమింప చేయాలని కోరారు.రోజువారి కార్యక్రమంలో భాగంగా వీడియో వద్దు కార్యాలయం వద్ద, పీఎం పాలెం వద్ద వంట వార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ శేషుబాబు, పి జాన్, కే నాగరాజు, కె అర్జునమ్మ, డి సూరిబాబు, యు లక్ష్మి, ఎం సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.


