కోనసీమ జిల్లా ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.
అమలాపురం వి న్యూస్ ప్రతినిధి) :డిసెంబర్ 31:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.గడిచిన 2023 ఏడాది ఎన్నో అను భవాలను నేర్పిందని వీడ్కోలు పలికారు.2024 నూతన సంవత్సరo మనందరికీ కొత్త ఆరంభాలు కొత్త అవకాశాలను, ఆశలను తేవాలని స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరంలో అందరికీ మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు.ఈ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థినీ విద్యార్థులకు చదువులు తోపాటుగా శాస్త్రీయ దృక్పథాన్ని సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు పోటీలనిర్వహణ తోపాటుగా వివిధ క్రీడా అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభను చాటుతూ నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్క ర్ కోనసీమ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.గడిచిన సంవత్సర కాలంలో
జిల్లా లోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం , స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజ లందరి సహకారంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థ వంతంగా అమలు చేసి జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ప్రగతి పథంలో నిలిపామన్నారు. 2024 నూతన సంవత్సరంలో కూడా రెట్టించిన ఉత్సాహం, నూతన ఉత్తేజ్జoతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ కోనసీమ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి జిల్లా ప్రజలందరూ పూర్తి సహాయ సహకారాలు అందిం చాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

