విశాఖ నగరంలో దారుణ ఘటన..ఓ యువతి పై 11 మంది గ్యాంగ్ రేప్.

విశాఖ నగరంలో దారుణ ఘటన..ఓ యువతి పై 11 మంది గ్యాంగ్ రేప్...

4 టౌన్ 3 టౌన్ లిమిట్స్లో జరిగిన ఘటన...

విశాఖ

: వి న్యూస్ : డిసెంబర్ 31: 

*రహస్యంగా విచారణ చేస్తున్న పోలీసులు...*


*రేప్ తరువాత భయంతో విశాఖ విడిచి వెళ్లిన యువతి...*


*తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయ్యడంతో వెలుగుచూసిన ఘటన...*


*వివరాల్లోకి వెళ్తే:*


*విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ యువతి, ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం యువకుడు ఆమెను మాట్లాడుకుందామని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ హెూటల్ గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత, యువకుడు అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో యువకుని స్నేహితుడు అక్కడికి చేరుకొని, యువతిని బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. తాను ప్రేమించిన ప్రియుడే, అతని స్నేహితుడితో అత్యాచారం చేయించడంతో తీవ్ర మనస్థాపనకు గురైన ఆ యువతి ఆర్కే బీచ్ కి చేరుకొని విలపించడం ప్రారంభించింది. అదే బీచ్ లో సందర్శకులకు ఫోటోలు తీసే ఓ ఫోటోగ్రాఫర్, ఆమెను గమనించి ఓదార్చినట్టు నటించి నేనున్నానంటూ నమ్మించి స్నేహితుల గదికి తీసుకువెళ్లాడు. ఆ గదిలో ఫోటోగ్రాఫర్ తో పాటు మరో ఏడుగురు యువకులు కలిసి యువతిని కొట్టి బలవంతంగా రెండు రోజులపాటు అత్యాచారం చేసినట్టు తెలిసింది. దీంతో ఆమె వారి చెర నుండి తప్పించుకుని అక్కడ నుండి పారిపోయింది. ఇదిలా ఉండగా కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించడంతో ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును డీసీపీ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. నాలుగో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.*