కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలి
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున
విశాఖ : వి న్యూస్ : డిసెంబర్ 31:
2024 నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో హాయిగా జీవించాలని.. ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున ఆకాంక్షించారు. అంతా మంచి జరగాలని.. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవాలని.. మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రకటన ద్వారా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో అటు రాష్ట్రం నుంచి ఇటు జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా ప్రజలకు ఎన్నో రకాల ఉత్తమ సేవలు అందాయని.. ఈ కొత్త ఏడాదిలో అంతకు మించి ఉత్తమమైన సేవలు అందుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంలోని ఉద్యోగులు, సామాన్య ప్రజలు వారి లక్ష్యాలు సాధించేందుకు.. మరెన్నో మైలు రాళ్ళు దాటేందుకు 2024 సంవత్సరం సరికొత్త వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు.
