భీమిలి ఎమ్మెల్యే అవంతి క్యాంపు కార్యాలయాన్ని ముట్టండించిన అంగన్వాడి సిబ్బంది.
భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 27:
16వ రోజుకి చేరిన అంగనవాడీల సమ్మె మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడి కార్యకర్తల రాష్ట్ర కమిటీ నాయకుల మధ్య జరిగిన చర్చలలో పాల్గొన్నారు. ఆ చర్చలు ఫలించకపోవడంతో 27న బుధవారం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల క్యాంప్ కార్యాలయాలను ఇల్లును ముట్టడించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయం బుధవారం 10 గంటల నుండి మూడు గంటల వరకు అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 16నుండి సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం మహిళలని కించపరచడం అవుతుందని కనీస వేతనం 26,000 చెల్లించాలని గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆన్దించాలని పెన్షన్ స్కీమును వర్తించాలని అంగనవాడి ఆయాలు గాని టీచర్లు గానీ చనిపోయిన వారికి కు గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలని ఇల్లు స్థలాలు కేటాయించాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియచేసారు. అంగన్వాడీ కార్యకర్తల నుండి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అవంతి మాట్లాడుతూ మీ సమస్యలన్నీ నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలణి పరిష్కరించే దిశగా పని చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు శాసనసభ్యులు అవంతికి అంగనవాడి కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కే వెంకటలక్ష్మి పద్మ శ్రీదేవి కొవ్వాడ లక్ష్మి అనురాధ ఐ టి యు నాయకులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి రవ్వ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.


