హరిత విశాఖే ద్యేయంగా మిద్దె తోటలు పెంచుదాం. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

హరిత విశాఖే ద్యేయంగా మిద్దె తోటలు పెంచుదాం.

నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

 

విశాఖపట్నం : వి న్యూస్ : డిసెంబర్ 27:


విశాఖపట్నండిసెంబర్ 27:- విశాఖ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు మిద్దె తోటల పెంపకం చాలా అవసరమనిఆదిశగా జివిఎంసి విశాఖ నగర ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టినందున నివాసితులు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె జివిఎంసి 2వ జోన్ 13వ వార్డులో మిద్దె మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఎకో వైజాగ్ కార్యక్రమంలో భాగంగా ఎకో గ్రీన్ అంశంపై టెర్రస్ గార్డెన్స్ అభివృద్ది కొరకు ప్రతీ అపార్టుమెంట్లపైభవనాలపైగేటెడ్ కమ్యూనిటీ ల వద్ద మిద్దె తోటలు ఏర్పాటు చేసుకునేందుకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మిద్దె తోటల పెంపకానికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో ప్రజలకు నిత్యవసరంగా ఉపయోగపడే 12 రకాల విత్తనాలు12 రకాల నారు మొక్కలను అందించడంతోపాటు అవి పెంచే కార్యక్రమం పై అవగాహనను అధికారులు కల్పించారని ఆమె తెలిపారు. వీటిల్లో ముఖ్యంగా నిత్యవసరంగా ఉపయోగపడే కాయగూరలుఆకుకూరలు విత్తనాలు ఉన్నాయని తెలిపారు. మన నగరం లో 35 శాతం పచ్చదనం కలిగి ఉందని దీనిని 50 శాతం పెంచాలనిఅంతేకాకుండా విశాఖలో ఈ మిద్దె తోటల వలన పొల్యూషన్కాలుష్యం తో పాటు వాతావరణం లోని వేడి తగ్గించుకోవచ్చని ఆమె తెలిపారు. వృక్షో రక్షిత రక్షితః” అంటే మనం వృక్షలను రక్షిస్తే అవి తిరిగి మనల్ని రక్షిస్థాయని తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ టెర్రాస్ లపై విరివిగా మొక్కలు పెంచి మిద్దె తోటల నిర్వహణ చేపట్టాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో రెండవ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మిప్రాజెక్ట్ ఆఫీసర్(యు.సి.డి) డి.లక్ష్మిడి.పి.ఓ ప్రసాద్ఎస్.ఆర్.యు మేనేజర్ శ్రీనివాస్ రాజమణిగ్రీన్ క్లైమేట్ జె.వి.రత్నంపలువురు వైఎస్ఆర్సిపి నాయకులుతదితరులు పాల్గొన్నారు.