నేషనల్ హైవే రోడ్డు మరమ్మతులు చేపట్టండి
జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ
విశాఖపట్నం: వి న్యూస్ : డిసెంబర్ 27:
విశాఖపట్నం డిసెంబర్ 27:- జివిఎంసి పరిధిలో పీఎం పాలెం నుండి షీలా నగర్ వరకు నేషనల్ హైవే రోడ్డు మరమ్మత్తుల పనులతో పాటు, పలు చోట్ల బిటి రోడ్డులను వేయాలని జివిఎంసి కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పీఎం పాలెం నుండి షీలానగర్ వరకు నేషనల్ హైవే రోడ్డును జివిఎంసి ప్రధాన ఇంజనీరు రవికృష్ణ రాజు, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాత్ రంజన్ తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వెంకోజి పాలెం నుండి డైరీ ఫారం వరకు నేషనల్ హైవే రోడ్డు మరమ్మతులకు గురైనందున ఒక పొర తారు రోడ్డును వెంటనే వేసే చర్యలు చేపట్టాలని జివిఎంసి ప్రధాన ఇంజనీర్ ను ఆదేశించారు. పీఎం పాలెం నుండి షీలా నగర్ వరకు నేషనల్ హైవే రోడ్డు మరమ్మతులతో పాటు ఒక పొర తారు రోడ్డు వేసేందుకు, అలాగే హనుమంతువాక జంక్షన్ లో ప్లై ఓవర్ నిర్మించేందుకు నేషనల్ హైవే అధికారుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నేషనల్ హైవేలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు మొక్కల సంరక్షణ కొరకు గ్రీన్ బెల్ట్ ప్రదేశాలలో అవరసరమైన చోట చైన్ లింక్డు మెస్ లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే గ్రీన్ బెల్ట్ మరియు సెంట్రల్ మీడియన్ లలో ఆకర్షణీమైన మొక్కలతో అందంగా తీర్చిదిద్దాలని, గ్రీన్ బెల్ట్ ఏరియాలోను, సెంట్రల్ మీడియన్ లలో అనధికార హోర్డింగులను, పెక్సీలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జివిఎంసి పర్యవేక్షక ఇంజనీరు శ్యాంసన్ రాజు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదరావు, జోనల్ కమిషనర్లు కనకమహాలక్ష్మి, ఆర్జీవి కృష్ణ, కార్యనిర్వహక ఇంజనీర్లు శాంతిరాజు, తారా ప్రసన్న, మత్స్యరాజు, ఉపకార్య నిర్వహణ ఇంజనీరు వంశీ తదితరులు పాల్గొన్నారు.
