సంక్రాంతి కల్లా రాబోయే సార్వత్రిక ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేస్తే క్యాడర్ నూతన ఉత్సాహంతో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది:దాసరి. శ్రీనివాసరావు
పియం పాలెం: వి న్యూస్ : డిసెంబర్ 27:
యువగలం పాదయాత్ర ముగింపు సభ కానీ విని ఎరగని రీతులు ప్రజాధరణ పొంది లక్షలాదిమంది తరలి రావడం జరిగింది అన్ని భీమిలి నియోజకవర్గ 6వ వార్డ్ టీడీపీ అధ్యక్షుడు దాసరి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటినుండి వైసీపీ పార్టీలో వలసలు మొదలయ్యాయి ఇక జగన్ పని అయిపోయిందని వైసీపీ పార్టీ అపజయం పాలవుతుందని ముందే కొంతమంది నాయకులు జాగ్రత్త పడుతున్నారు.తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ముఖ్యంగా సంక్రాంతి కల్లా అభ్యర్థిని ఖరారు చేస్తే క్యాడర్ నూతన ఉత్సాహంతో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది నేటి పరిస్థితి జనసేనతో పొత్తు కరారు అయింది. ఏ నియోజకవర్గంలో ఎవరికికేటాయిస్తారు అని ఒకపక్క, వైసిపి నాయకులు వలస రావడం రెండో పక్క నియోజకవర్గాల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది ముఖ్యంగా మా భీమిలి నియోజకవర్గం చూస్తుంటే ఏ నాయకులు చూసినా భీమిలి సీటు మాకే కేటాయిస్తారు అనువాపక్క జనసేన గాని వైఎస్ఆర్ నుంచి వలస వద్దాం అన్న నాయకులు గాని పదే పదే పత్రికల్లో వస్తున్నాయి. గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీకి కష్ట కాలంలో ఎంతో ధైర్యంతో సాహసంతో జండా మోస్తున్న కార్యకర్తలకి సీటు వేరే వాళ్ళకి ఇస్తే మన పరిస్థితి ఏంటి అనే భయమైన వాతావరణంలో ఉన్నారు .దయచేసి అది నాయకత్వం భీమిలి నియోజకవర్గ అభ్యర్థి ని త్వరగా నిర్ణయం తీసుకోవాలని దాసరి శ్రీనివాస్ విశాఖపట్నం అధికార ప్రతినిధి కోరుతున్నారు...

