జనసేన - టిడిపి ఉమ్మడి గెలుపుకై బలంగా పోరాడుతాం : రాజు నవిరి

జనసేన - టిడిపి ఉమ్మడి గెలుపుకై బలంగా పోరాడుతాం : రాజు నవిరి

తగరపువలస : వి న్యూస్ : డిసెంబర్ 28 :

జనసేన పార్టీ తగరపువలస 1వ వార్డ్ జనసైనికుడు లోకేష్ జన్మదినO సందర్భంగా భీమిలి జనసేన పార్టీ నాయకులు రాజు నవిరి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న జనసైనికులతో రాజు నవిరి మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మనందరం మరింత బలంగా పని చేసేలా జనసేన - టిడిపి ఉమ్మడి గెలుపు కోసం సందీప్ అన్న లాంటి యువ నాయకుడి గెలుపు కోసం బలంగా పోరాడుదామని తెలిపారు. ఈ వేడుకలో జనసేన సీనియర్ నాయకులు సతీష్ రామోజీ, స్వరాజ్, సతీష్ కానూరి, సురేష్, లోవరాజు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.