ఎన్నాళ్ళీ డోలిమోతలు

ఎన్నాళ్ళీ డోలిమోతలు.

లంబసింగి: వి న్యూస్ : డిసెంబర్ 26: 

చెక్కరాయి బంధ గ్రామం, లంబసింగి పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి రాధ అనే గర్భిణీకి మంగళవారం పురిటి నొప్పులు రావడంతో లంబసింగి పీహెచ్సీ కి డోలిమోతతో తీసుకెళ్లిన గ్రామస్తులు,కుటుంబ సభ్యులు.దేశంలో తరతరాలుగా పాలకులు మారుతున్న గిరిజన బ్రతుకులు మాత్రం మారట్లేదని, గిరిజన గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు టి.రాజ్ కుమార్ అన్నారు. చెక్కరాయి బంధ గ్రామానికి రోడ్డు నిర్మించి ఇవ్వాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దాకా పాలకులకు,అధికారులకు ఎన్నోసార్లు విన్నవించ్చుకున్నామని కానీ ఇప్పటివరకు మా గ్రామానికి రోడ్ సదుపాయం కల్పించలేదని రోడ్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కాబట్టి ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని గిరిజన సంఘం నాయకుడు టి.రాజ్ కుమార్,గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.