గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పూర్తి చేసిన పోతిన హనుమంతరావు
మధురవాడ వి న్యూస్ 2023 నవంబర్ 10
ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ ఐదో వార్డ్ నాయకులు పోతిన. హనుమంతరావు కొనియాడారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో 5వ వార్డ్ నగరం పాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మాజీ విశాఖ వైసీపీ పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ముందుగా ఐదో వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం 15 సచివాలయ పరిధిలోని సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరో వార్డు వైయస్సార్ క్రికెట్ స్టేడియం నుంచి భారీ ఎత్తున ద్విచక్రాల వాహనాల ర్యాలీని పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావుకి ఘన స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి కొమ్మాది జంక్షన్ వరకు వెళ్లి అక్కడ నుంచి నగరంపాలెం గ్రామానికి భారీ ఎత్తున అభిమానులతో అవంతి శ్రీనివాసరావు సభకు విచ్చేయడం జరిగింది..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై ఎమ్మెల్యే ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందరి సహకారంతో సంపూర్ణంగా పూర్తి చేసిన పోతిన హనుమంతరావుని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అభినందించారు. అలాగే రానున్న రోజులో పోతిన హనుమంత రావు ని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజలకి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు....
