నగరంపాలెం రహదారి పనులు పూర్తిచెయ్యాలని భీమిలి ఎమ్మెల్యే అవంతికి వినతిపత్రం అందచేసిన సిపిఐ నాయకులు.
నగరంపాలెం : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 10:
భీమిలి నియోజకవర్గం ఐదవ వార్డ్ నగరంపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మొత్తంశెట్టి శ్రీనివాసరావుకి మధురవాడ ఏరియా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వాండ్రాసి సత్యనారాయణ ఆధ్వర్యంలో 2014 ఫిబ్రవరి 15వ తారీఖున మధురవాడ హైవే నుంచి నగరంపాలెం 80 అడుగుల రహదారికి శంకుస్థాపన చేశారు. అప్పుడు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులుగా మీరే ఉన్నారు. ఇప్పటివరకు ఆ రహదారి పూర్తవ్వలేదు ప్రస్తుతం మీరే శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ రహదారిని పూర్తి చేయాలని, నగరంపాలెం చెరువు అలాగే బొట్ట వానిపాలెం ఊరు వెనక ఉన్న చెరువు వాకింగ్ ట్రాక్ కింద తయారు చేయాలని సిపిఐ తరుపున వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు బేగం, సిపిఐ నాయకులు జి వేలంగణ రావు, బి బంగారయ్య, తదితరులు పాల్గొన్నారు.
