వెల్లంకి గ్రామంలో 100 మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు.

వెల్లంకి గ్రామంలో 100 మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు.

వెళ్ళంకి : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 10:

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలo లో వెల్లంకి గ్రామంలో బిజేపి పార్టీ కార్యాలయంలో వెల్లంకి,పెద్దిపాలెం, ముకుందపురం,గొట్టి పల్లి గ్రామాల 100 మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు బిజెపి కిసాన్ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజేపి విశాఖ జిల్లా అధ్యక్షులు మేడ పాటి రవీంద్ర రెడ్డి,విశాఖ జిల్లా బిజేపి ఇంఛార్జి పుట్ట గంగయ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా మేడపాటి రవీంద్ర రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆనందపురం మండలంలో గతంలో 1000కి పైగా ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఆనందపురం మండలం లో అన్ని గ్రామ పంచాయతీల్లో అందజేయడం జరిగింది అని,శుక్రవారం ఆనందపురం మండలంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు దీపావళి సందర్భంగా అర్హులైన అందరికీ అందజేయడం చాలా శుభ పరిణామం,భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికీ వరకు రెండు వేలకు పైగా ఉజ్వల కనెక్షన్లు అందజేయడం జరిగిందని ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:- మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,బిజేపి నాయకులు యోలూరు ధర్మవతి, ఇంటి సత్తిరాజు,యేటుకూరి వెంకట చైతన్య వర్మ,కర్రోతు సత్యనారాయణ,బుత్తల రాజు, సురేశ్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు మరియు అర్హులైన లబ్ధిదారులు పాల్గొన్నారు.