విశాఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు.

విశాఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. 

పెందుర్తి: వి న్యూస్ ప్రతినిధి (నవంబర్ 10): 

పెందుర్తి నియోజకవర్గం నరవ స్థానిక విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగాం విచ్చేసిన సిటిసి ట్రైనింగ్ సొల్యూషన్ ట్రైనర్ ఎ.శివప్రసాద్. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ. ఇంజనీరింగ్ విద్య యొక్క ప్రాముఖ్యతను నాటి కాలం నుండి ఇంజనీరింగ్ విద్యలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఆయన వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ డా. వి.శ్రీదర్ పట్నాయక్ మాట్లాడుతూ విద్యతోపాటు అత్యున్నత నైపుణ్యం గల వారు జీవితంలో మంచిస్థాయిలో ఉంటారని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థిని, విదార్థులు వివిధరకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వ హించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమం ఫస్ట్ ఇయర్ హెచ్ ఓ డి ఉదయ్ భాస్కర్ పర్యవేక్షణలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంతో కళాశాల ఎ ఓ సుబ్బరాజు వివిద విభాగాల అదిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్థులు తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు...