అగ్రిసెట్ లో ఉత్తీర్ణత సాధించిన "మన్యం బిడ్డ ":- నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన పవిత్ర
:- శ్రీకాకుళంలోని నైరా వ్యవసాయ కళాశాలలో సీటు కైవసం
వి.ఆర్.పురం /వి న్యూస్ ప్రతినిధి : నవంబర్ 16:
వి ఆర్ పురం మండలం లోని మారుమూల ప్రాంతమైన చొప్పల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్దిని 'ఉర్మా పవిత్ర' ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అగ్రి సెట్ లో ఉత్తీర్ణత సాధించింది. అగ్రిసెట్ లో నూట డెబ్బై ఒకటోవ ర్యాంకు పొందడం తో ఏజీ బీఎస్సీలో ఫ్రీ సీట్ సాధించింది. చింతూరు డివిజన్,విఆర్ పురం మండలానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి, పవిత్రమైన విద్య లో ముందంజ వేస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయకుండా చదువే తన లక్ష్యం గా మునుముందుకు సాగుతూ ఇంటర్ లో ఉత్తీర్ణత పొంది అనంతరం వ్యవసాయ రంగం పై ఉన్న ఆసక్తి తో వ్యవసాయ డిప్లొమా కొనసాగిస్తూ, అగ్రిసెట్ కు సన్నద్ధం అయ్యింది . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అగ్రిసెట్ లో ఉత్తమ ర్యాంకు సాధించి శ్రీకాకుళం లోని ప్రతిష్టాత్మకమైన నైరా వ్యవసాయ కళాశాలలో తన దైన శైలి లో సీట్ కైవసం చేసుకుంది. పవిత్ర తల్లిదండ్రులు నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా తమబిడ్డ తాము పడుతున్న కష్టాలు తాను పడకూడదని గొప్ప సదువుల చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని వారి కోరిక, తన చదువుకు ఎటువంటి కష్టం రాకుండా తన తల్లిదండ్రులు చూసుకోవడం జరిగింది. పట్టుదల, కృషి ఉంటే ప్రతిభ ఎవరి సొంతం కాదని పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని మన్యం బిడ్డ మరోసారి నిరూపించింది.
మన్యం బిడ్డ కనబరిచిన ప్రతిభను స్కూల్ యాజమాన్యం,గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, పలువురు నాయకులు కొనియాడుతున్నారు.

