కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన: కేవలం 5 శాతం వడ్డీకే రూ. 1లక్ష నుండి 3లక్షల వరకు లోన్. మధురవాడ మండల బీజేపీ అధ్యక్షులు బండారు అనిల్ కుమార్

కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన: కేవలం 5 శాతం వడ్డీకే రూ. 1లక్ష నుండి 3లక్షల వరకు లోన్. మధురవాడ మండల బీజేపీ అధ్యక్షులు బండారు అనిల్ కుమార్

మధురవాడ : వి న్యూస్  ప్రతినిధి : నవంబర్ 17:


విశ్వఖర్మ యోజన : దేశంలోని చేతి వృత్తుల వారికి కేంద్రంలోని మోదీ సర్కార్ మంచి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని చేతి వృత్తి పనివారు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి బండారు అనిల్ కుమార్ తెలిపారు సూచించారు. సులభంగా 1లక్ష నుండి 3లక్షల వరకు లోన్ అందించే కొత్త పథకానికి కేంద్ర కాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకంలో లోన్ పొందిన వారికి లోన్ పై కేవలం 5 శాతం మాత్రమే వడ్డీ ఉన్నట్టు తెలిపారు. విశ్వకర్మ యోజన పథకం పూర్తి వివరాలు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేత్రుత్వంలో కేంద్ర కేబినెట్ విశ్వకర్మ యోజన పథకం పై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకo ముఖ్య ఉద్దేశ్యం చేతి వృత్తి కార్మికులను ఆదుకోవాలని సదుద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చేతి వృత్తి కార్మికులకొరకు ఆదుకునేందుకు 15వేల కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా కేటాయించినట్లు తెలిపింది. సంప్రదాయ హస్త కళా నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించారు. విశ్వకర్మ యోజన పథకం కింద దాదాపు 30లక్షల కుటుంబాలకు ప్రయోజనo కలుగుతుందని విశాఖ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి  బండారు అనిల్ కుమార్ తెలిపారు. ఈ పథకం 2023 నుండి 2028 వరకు ఐదు ఏళ్ళ పాటు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా తొలివిడతలో 18 సాంప్రదాయక చేతివృత్తులు చేసుకునే వారికి పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ఈ క్రింది చేతివృత్తులవారు విశ్వకర్మ యోజన పతకంలో అర్హులుగా తీసుకుంటామన్నారు.    01)వడ్రంగులు,02) పడవల తయారీ దారులు, 03)ఆయుధ / కవచ తయారీదారులు, 04)కమ్మరులు, 05)సుత్తి మరియు పరికరాల తయారీ దారులు, 06)తాలాల తయారీ దారులు, 07)బంగారం పని వారు, 08)కుమ్మరులు, 09)శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు ) రాళ్లను పగలగొట్టే వృత్తిలో వుండే వారు, 10) చర్మకారులు / పాదరక్షలు తయారీ దారులు,  11)తాపీ పని వారు, 12) గంపలు / చాపలు / చీపురులను తయారు చేసేవారు,  13)కొబ్బరినారతో తయారయ్యే వస్తువులను తయారు చేసేవారు ( సంప్రదాయ ఆటబొమ్మాల రూపకర్తలు  ),   14)క్షురకులు ( నాయీ వృత్తిదారులు ), 15)మాలలు అల్లేవారు,16) రజకులు,17) దర్జీలు, 18)చేపలను పట్టేందుకు ఉపయోగించే వళలను తయారు చేసేవారు.  ఈ పథకానికి *కనీస వయస్సు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. * 18 సాంప్రదాయక చేతివృత్తులలో ఒకటి చేస్తూనే వారయ్యి ఉండాలి.  * రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి తమ వృత్తి నిర్వహిస్తుండాలి. * గత 5 సంవత్సరాలలో PMEGP, PM SVANIDHI, MUDRA, వంటి వాటిలో లోన్ తీసుకొని వుండకూడదు. ఒక వేల ఆ లోన్ పూర్తిగా చెల్లించి ఉండాలి వారే అర్హులు. * కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పీఎం విశ్వకర్మ పథకం వస్తుంది. * ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంభ సభ్యులు అంటే భర్త, భార్య, పెళ్లి కానీ పిల్లలు ఈ పథకానికి అనర్హులు. అని తెలిపారు. ఈ పథకానికి కావలసిన ధ్రువపత్రాలు : * 1)ఆధార్,  2) కుటుంభ సభ్యుల ఆధార్లు, 3) బ్యాంకు పాస్ పుస్తకం, 4) అడ్రస్ ధ్రువీకరణ ( రేషన్ కార్డు, రైస్ కార్డు, ఇతర ప్రభుత్వం ఆమోదం పొందిన ధ్రువపత్రాలు ), 5) ఆధార్ కి లింక్ అయ్యిన చరవాణి నెంబర్ పని చెయ్యాలి, 6) పాన్ కార్డు తప్పనిసరి. ఈ పథకాన్ని మీకు అందుబాటులో CSC ( కామన్ సర్వీస్ సెంటర్ లో  ) నమోదు చేసుకోవాలని సూచించారు.