వాంబేకాలనిలో అగ్నికి ప్రమాద బాధితులను పరామర్శించిన భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల.

వాంబేకాలనిలో అగ్నికి ప్రమాద బాధితులను పరామర్శించిన భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల.  

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 24:    

 జీవీఎంసీ 7వ వార్డ్ పరిధిలోని వాంబేకాలనిలో  అగ్ని ప్రమాద బాధితులను భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల  శుక్రవారం పరామర్శించారు. ఈ ప్రమాదం ఒకే కుటుంబం కు చెందిన వేముల బాలరాజు, అతడి భార్య చిన్ని, పెద్దకుమారుడు, కార్తీక్, చిన్ని కుమారడు గిరిలు భవాని మాలలో ఉన్నారు. వీరు ఇంట్లోనే ఉన్న  సమయంలో  గ్యాస్ సిలిండర్ మార్చే సమయంలో  మంటలు వ్యాప్తి చెందడంతో వారు మంటల్లో చిక్కుకున్నారు. వారిని స్థానికులు కేజీహెచ్కి  తరలించగా కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని  భీమిలి జనసేన ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.