రాజీవ్ గృహ కల్ప కాలనీలో ఫ్రైడే డ్రైడే, మలేరియా, డెంగీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మలేరియా సిబ్బంది.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 24:
జోన్2 మారికవలస, రాజీవ్ గృహ కల్ప కాలనీలో రాజీవ్ గృహ కల్ప కాలనీలో ఫ్రైడే డ్రైడే, మలేరియా, డెంగీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆదేశాలతో సూపెర్వైసర్ దీవెనమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపెర్వైసర్ దీవెనమ్మ మాట్లాడుతూ నిత్యం మన ఇంట్లో ఉండే మంచి నీటిలో ఉండే వస్తువులు వారానికి ఒకసారి శుక్రవారం (ఫ్రైడే )శుభ్రం చేసుకోవాలని, నిత్యం కనిపించే వస్తువులు, ఫ్రిడ్జ్, టైర్లు, రోలు, కూలర్లు, మాణిప్లంట్లు, ఏసీలు తరచూ శుభ్రం చేసుకోవాలని ఈ వస్తువులలో దొరికే లావాను వారికి చూపిస్తూ (లార్వా వల్ల దోమలు ఎలా వృద్ధి చెందుతాయో అనే విషయం పై కాలనీ ప్రజలకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో 5వవార్డ్ మలేరియా సిబ్బంది సోషల్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

