పద్మనాభంలో వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దీపోత్సవమునకు 8 లక్షల రూపాయలు కేటాయించవలసిందిగా భీమిలి నియోజవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి.
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలం.వి న్యూస్ : నవంబర్ 24:
భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పద్మనాభం లో వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానము నందు డిసెంబర్ నెలలో జరుగు దీపోత్సవమునకు సింహాచలం దేవస్థానం నుండి 8 లక్షల రూపాయలు కేటాయించవలసిందిగా మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేసి యున్నందున మరియు ఈవో శ్రీ పద్మనాభ స్వామి దేవస్థానం వారు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ వారి ద్వారా దీపోత్సము నిర్వహణ కొరకు ఎనిమిది లక్ష రూపాయలు కేటాయించవలసిందిగా ఈవో సింహాచలం దేవస్థానం వారికి ప్రతిపాదన పంపించియున్నారు మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రావు గారి విజ్ఞప్తి మరియు డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నం వారి ప్రతిపాదన పురస్కరించుకొని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీయుత కమిషనర్ ఎండోమెంట్ వారికి సదరు ప్రతిపాదనను పంపించగా శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి దీపోత్సము నిర్వహణకు అవసరమగు 8 లక్షల రూపాయలు సింహాచలం దేవస్థానం నుండి కేటాయించుటకు శ్రీయుత కమిషనర్ ఎండోమెంట్ గొల్లపూడి వారు అంగీకారం తెలిపి ఉన్నారు

