అగ్ని ప్రమాదానికి గురైన జశ్వంత్ ఫ్యాషన్ కుటుంబాన్ని పరామర్శించిన డా. సందీప్ పంచకర్ల

అగ్ని ప్రమాదానికి గురైన జశ్వంత్ ఫ్యాషన్ కుటుంబాన్ని పరామర్శించిన డా. సందీప్ పంచకర్ల.

తగరపువలస : వి న్యూస్ ప్రతినిధి : నవంబర్ 28

భీమిలి నియోజకవర్గం తగరపువలస మార్కెట్ రోడ్ నందు రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన జశ్వంత్ షాపింగ్ మాల్ వారి కుటుంబాన్ని జనసేన పార్టీ భీమిలి ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల పరామర్శించి మాట్లాడుతూ భాదిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తు, జరిగిన ప్రమాద విపత్తుకు ప్రభుత్వం తరుపున న్యాయం జరిగేలా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామని వివరించారు. అలాగే చాలా విస్తీర్ణ జనాభా కలిగిన భీమిలి పరిధిలో అగ్నిమాపక యూనిట్ ఇటు కొమ్మాది నుండి అటు ఆనందపురం, భీమిలి, పద్మనాభం, భోగాపురం మండాలాల వరకు ఒకే ఒక్క యూనిట్ ఉంటే ప్రమాదం నుండి కాపాడుకోవడం ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమoలో జనసేన నాయకులు శాఖరి శ్రీనుబాబు, బి.వి.క్రిష్ణయ్య, రాజు నవిరి, సతీష్ రామోజీ, అక్రమాని దివాకర్, కొయ్య శ్రీను, పరిమి భువనేశ్వరి, జనసైనికులు పాల్గొన్నారు.