వాటర్ రోల్ అబ్జర్వర్ (ఎలక్ట్రోరల్ అధికారి) జె శ్యామల రావు ఐఏఎస్ కి ఓటర్ జాబితాలో ఉన్న అవకతవకలను సరి చేయమని వినతిపత్రం అందచేసిన టీడీపీ నేతలు
విశాఖ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 28:
మంగళవారం విశాఖ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఓటర్ రోల్ అబ్జర్వర్( రాష్ట్ర ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు) జే శ్యామలరావు ఐఏఎస్ కి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరగబోవు ఎన్నికలకు తయారుచేసిన ఓటర్ జాబితాలో ఉన్న అవకతవకల పై విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించి వాటర్ జాబితాను కచ్చితంగా తప్పులు లేకుండా తయారు చేయాలని విశాఖ టీడీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, భీమిలి టిడిపి ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు, విశాఖ సౌత్ ఇంచార్జ్ గండి బాబ్జి, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ తదితర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

