పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని డిమాండ్
కొమ్మాది: వి న్యూస్ : ఆదివారం :అక్టోబరు 15 :
ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర సందర్బంగా ఎస్ సి, ఎస్ టి వర్గాలకు 200 లోపు వినియోగదారులందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తామన్న మీరు ఇచ్చిన హామీని మర్చిపోయారా అని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం కొమ్మాది జంక్షన్ లో ఉన్న రైతు బజార్లో దుకాణదారులకు, వినియోగదారులకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ కేంద్రం విద్యుత్ సంస్కర్ణలు అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రబాగాన అమలుపర్చుతు ప్రజలు నెత్తిన గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో 25 వేల కోట్ల రూపాయలు భారాలు మోపారని తక్షణమే పెంచిన ఛార్జిలన్నీ రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, ఎన్ త్రినాధ్, నారాయణరావు, కాలీషా, డి కైలాష్ తదితరులు పాల్గొన్నారు.
