ఘనంగా దేవి నవరాత్రులు ప్రారంభం

ఘనంగా దేవి నవరాత్రులు ప్రారంభం

చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత

మధురవాడ: వి న్యూస్ : అక్టోబర్ 15: 

మాజీ ముఖ్యమంత్రి,జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగ అరెస్ట్ చేసి జైలు లో పెట్టడం జరిగిందని, సుమారు నెల రోజులు అవుతున్న జైలు లో ఆయనకు సరైన సదుపాయాలు కల్పించక పోవడం వలనే రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత దేవి నవరాత్రులు సందర్భంగా వార్డ్ పరిధి లో గల పలు ఆలయాల్లో,దుర్గా మండపాలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా తన నిజాయితీని నిరూపించుకొని కడిగిన ముత్యం లా బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారని, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఐటీ రంగం లో ఆయన చేసిన అభివృద్ధి దేశానికే ఆదర్శం అని, లక్ష ల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించారని,రాష్ట్ర అభివృద్ధి కి ఆయన ఎంతగానో పాటుపడ్డారని అలాంటి మహోన్నత వ్యక్తి పై వ్యక్తిగత కక్షతో అక్రమ కేసులు బనాయించి హింసించడం అన్యాయమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోవాలని, అలా మార్చికోపోతే రానున్న సంగ్రామం లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు.ఆ లోక మాత అయిన దుర్గ మాత కృప కటాక్షలాతో బాబు గారు ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని, ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని కాపడగలరని అందుకే ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమం లో వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవి కుమార్, మంగరజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.