విభిన్న సేవలు అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్న : కుర్ర రంగ నాయక్ (నాని)
కరీంనగర్ : వి న్యూస్ : అక్టోబర్ 01:
ఇంటర్నేషనల్ న్యూ విజన్ ఫౌండేషన్ కుర్ర రంగ నాయక్ (నాని) భారతదేశంలో ఎవరికైనా ఆపద వస్తే ఇంటర్నేషనల్ న్యూ విజన్ ఫౌండేషన్ తోడుగా ఉంటది అని తెలిపారు.కుర్ర రంగా నాయక్ (నాని) నల్గొండ జిల్లా : మిర్యాలగూడ నందు జనయేత్రి ఫౌండేషన్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య పురస్కారం డాక్టర్ ఎండీ అహ్మద్ సోహెల్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుర్ర రంగ నాయక్ (నాని) మాట్లాడుతూ తను గత 5 సంవత్సరాల నుండి ఈ రక్తదాన కార్యక్రమాలు చేస్తున్నాని ఎందరో పేద ప్రజలకు సాయం చేయడం నా అదృష్టంగా | భావిస్తున్నాను మరియు కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మంది రక్తం దొరక్క చాలా ఇబ్బంది పడటం జరిగింది, అలాంటి వారిని సైతం రక్తం సమాయానికి సమకూర్చడం జరిగిందని మరీ ముఖ్యంగా కొన్ని వందల ప్లాస్మా దానాలు చేయించి కరోనా వ్యాధిగ్రస్థులను బ్రతికించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యువత రక్తదానం వల్ల అపోహ వల్ల రక్తదానానికి రావడం లేదని, వారి కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియ జేశారు. మీరు ఒక్కరు రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడినవరావుతారని , మరియు రక్తదానం చేసిన వారు ఆరోగ్యంగా తయారు అవుతారని ఆయన తెలియ జేశారు. 3,000మందికి పైగా అర్హులకు రక్తదానం చేయడం జరిగిందని తెలియ జేశారు. ప్రతి ఇంటి నుండి ఒక రక్తదాతను తయారు చేయడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా భారత దేశంలో ఎవ్వరికైనా ఏ సమయంలో నైనా రక్తం అవసరం అయ్యిన వారు ఈ క్రింది అడ్రెస్స్ నందు కానీ ఫోన్ నెంబర్ ఫోన్ చేసైనా సంప్రదించవచ్చని 24×7 అందుబాటులో ఉంటానని తెలిపారు.
గ్రామం : బాలంపల్లి
మండలం : అడవిదేవులపల్లి
జిల్లా : నల్గొండ
తెలంగాణ రాష్ట్రం
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 6304439787

