బాబుకు మద్దతుగా సైకిల్ యాత్ర! సంఘీభావం తెలియజేసిన టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు.

బాబుకు మద్దతుగా సైకిల్ యాత్ర! సంఘీభావం తెలియజేసిన టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు.  

మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 06 :

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని.. బయటకు రావాలని కోరుతూ గాంధీ జయంతి రోజున శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం,నారువ గ్రామం నుంచి అయిదుగురు తెదేపా కార్యకర్తలు సైకిల్ యాత్ర ప్రారంభించారు.తెదేపా గ్రామ అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ ఎన్.రామకృష్ణ ఆధ్వర్యంలో సీహెచ్ రామసూరి,ఎన్. ఆదినారాయణ,ఎన్.సుందర రావు, ఎస్.రమేష్ ఈయాత్ర చేస్తున్నారు. ఈయాత్ర ఆనందపురం మీదుగా మధురవాడ చేరింది.ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,వాళ్లకు సంఘీభావం తెలియజేసి బోట్టవానిపాలెం జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ కార్యాలయంలో బస,వసతి ఏర్పాట్లు చేశారు.ఈసందర్భంగా మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ.. టీడీపీ ఎప్పుడూ ప్రజా సంక్షేమానికి పరితపించే పార్టీ అని,వైకాపా ప్రభుత్వం అది చూసి ఓర్వలేక చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని,స్వచ్చందంగా మద్దతుగాఉన్నారని అన్నారు.ఒక్క అవినీతి ఆరోపణలు లేకపోయినప్పట్టకి కనీస ఆదారాలు కూడా లేని కేసులో చంద్రబాబునాయుడుకు బెయిల్ రాకపోడానికి ప్రధాన కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని ఆరోపించారు.మాజీ సర్పంచ్ ఎన్.రామకృష్ణ వారి బృందం చేస్తున్న సైకిల్ యాత్ర సజావుగా సాగి విజయవంతం కావాలని కోరారు.కార్యక్రమంలో టిడిపి నాయకులు ఈగల రవి, కొర్రాయి మంగరాజు,ఇయ్యపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.