భాజపా మండల కమిటీలను బలోపేతం చేద్దాం:-
వెల్లంకి : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 07:
శనివారం ఉదయం భీమిలి నియోజకవర్గం లో ఆనంద పురం మండలo వెల్లంకి గ్రామంలో బిజేపి పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆనందపురం మండలం సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆనందపురం మండలం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు, ఆనందపురం మండలంలో బిజేపి కార్యకర్తలను తయారుచేసి,కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల్లోనికి తీసుకెళ్లాలని సూచించారు, ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.ఆనందపురం
మండల పార్టీ అధ్యక్షులుగా మీసాల రామునాయుడు,2వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మండల ఉపాధ్యక్షులుగా:-గండ్రెడ్డి వెంకట్రావు,పి.సాయి రమేశ్, మళ్ళారపు కృష్ణ,పిల్లా చిన్నరావు ప్రధాన కార్యదర్శిలు:- కే.వి.వి. సూర్య నారాయణ,బంక సీతo నాయుడు,కోశాధికారిగా:- పోతిన జీవన్ సంతోష్, కార్యదర్శులుగా :- బోర శ్రీను,కర్రోతు సత్యనారయణ,ఆర్.గోవింద రావు,కే.లక్ష్మణా రావు,ఆనందపురం మండలం పూర్తి కమిటీ వేయడం జరిగింది.
ఆనందపురం మండల ఎస్సీ మోర్చ
అధ్యక్షులుగా ఇంటి సత్తిరాజు, ప్రధాన కార్యదర్శిగా నిమ్మకాయల అప్పలరాజు,మండల కిసాన్ మోర్చ
అధ్యక్షులుగా గంటి వెంకట నాయుడు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు మీసాల రాము నాయుడు కి నూతన మండల కమిటీ ఘనంగా సత్కరించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందపురం మండలo లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను,సీనియర్ నాయకులను కలుస్తూ మండలంలో భారతీయ జనతా పార్టీ ని బలోపేతం చేయడం కొరకు మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని అందులో భాగంగా బిజేపి ఆనందపురం మండల నూతనంగా మండల కమిటీ సభ్యులందరం మా గ్రామలలో పర్యటించి బూత్ కమిటీల నియామకం జరుగుతుందని,అన్ని పంచాయతీలలో మేము పర్యటన చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి మన రాష్ట్రంలో అధికారంలో కి రావడానికి మా వంతు కృషి చేస్తామని మాట్లాడారు.

