భీమిలి నియోజకవర్గంలో 'కాంతితో క్రాంతి' టీడీపీ నేతల నిరసన కార్యక్రమం.
భీమిలి : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 07:
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ భీమిలీ నియోజక వర్గం ఇంఛార్జి కోరాడ రాజబాబు ఆదేశాలు మేరకు, 3వ వార్డ్ ఎగువపేటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో,5వవార్డ్ టీడీపీ కార్యాలయం నందు 5వవార్డ్ టీడీపీ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో 7వ వార్డ్ పిలకవాణిపాలెం, 7వ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ ఆధ్వర్యంలో,పాతమధురవాడ మెట్టనందు రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకట రావు ఆధ్వర్యంలో,7వ వార్డ్ ఆదిత్య నగర్లో విశాఖ పార్లమెంట్ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో 'కాంతి తో క్రాంతి' అనే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ఇంటి ఆవరణంలో ఉన్న లైట్లు ను ఆపి కొవ్వొత్తులు,మొబైల్ లైట్లు వెలుగు లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు భీమిలి నియోజకవర్గం లో అన్ని ప్రాంతాలలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాంటి మచ్చ లేకపోయినా కేవలం వ్యక్తిగత కక్షతో ఆయనపై బురదజల్లే విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునకని,ఈ విధమైన రాజకీయాలు ప్రజాక్షేత్రం లో ఆమోదయోగ్యం కాదని ఆమె తెలిపారు. వ్యక్తిగతంగా కాకుండా అభివృద్ధిలో పోటీ పడాలని అది చేతకాక ఈ విధంగా ప్రజలను తప్పు దారి పట్టించడం తగదని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో . వార్డ్ టిడిపి ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నమ్మి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


