కాంతితో క్రాంతి కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు

కాంతితో క్రాంతి కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు

విశాఖ : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 07:

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కాంతితో క్రాంతి అనే కార్యక్రమంలో భాగంగా కాగడాలు, కొవ్వొత్తులు, సెల్ టార్చర్లతో శనివారం నిరసన ప్రదర్శన తన నివాసం వద్ద కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకుల తో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడమైనదని, చంద్రబాబు నాయుడు త్వరలోనే తిరిగి వస్తారని కడిగిన ముత్యంలా బయటికి వచ్చి తిరిగి ముఖ్యమంత్రి అయి తీరుతారని, రాష్ట్రాన్ని సుభిక్షం మరియు సంక్షేమ పథకాలతో పురోగతి బాట పట్టిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.