పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అవంతి మాటలను ఖండించిన జనసేన

పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అవంతి మాటలను ఖండించిన జనసేన

తాటితురు: వి న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 07:

తాటితురు పంచాయితీ ఈత పేటలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నాయకులు నక్కా శ్రీధర్ ఆర్థిక సహాయంతో పల్లంటి.అప్పలరాజు అధ్వర్యంలో కాకార.మంగమ్మ మరియు వాణపల్లి.బంగరమ్మ కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి మండల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు గుడివాడ.కిరణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే అవంతి పవన్ కళ్యాణ్ పై చేసిన వాఖ్యాలను తీవ్రంగా ఖండించారు.

పవన్ కల్యాణ్ ను అనే స్థాయి అవంతీది కాదు అని ఆయనను అనే ముందు కొంచెం ఆలోచన చెయ్యాలి అని తెలిపి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో

జనవాణి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన దగ్గరకి ఆ ప్రాంత రైతులే పలాన పెదబాబు అనే వ్యక్తి వలన రైతులు నష్టపోయారు అని భూములను దోచుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు అని చెప్తే పవన్ కళ్యాణ్ స్పందించారు అని అవంతి మాటలకు బదులు చెప్పారు. ఆ ప్రాంతంలో భూములు కోల్పోయిన ఏ రైతును అడిగినా అక్కడ అధికార ప్రభుత్వం నాయకులు చేసిన భూ అక్రమాలు బయటపడతాయి అని పవన్ కళ్యాణ్ స్థానిక రైతులు ఆవేదన తెలియజేశారని ఇలా మీలా అసంతృప్తి నాయకులను బుజ్జగించే ప్రయత్నంలో ప్రోటోకాల్ కి వ్యతిరేఖంగా అధికారం ఉపయోగించుకుని ప్రభుత్వ అధికారుల పై ఒత్తిడి తీసుకు వచ్చి శిలాఫలకాలపై పేర్లు వేయించిన మీరు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మా నాయకుడిని అనే ముందు మీకు పెదబాబు భు అక్రమాలు చేయలేదు అని నిరూపించాలని ఉంటే పవన్ కళ్యాణ్ మాటలు తప్పు అని నిరూపించాలి అనుకుంటే ఓ రిటైర్డ్ జిల్లా జడ్జితో ఆ ప్రాంత భూ అక్రమాల పై కమిటీ వేసి ఏ అన్యాయం జరగలేదు అని నిరూపించే దమ్ముందా మీ పార్టీకి అని జనసేన పార్టీ తరుపున సవాల్ చేసారు. రాబోయే కాలంలో మీకు రైతులందరూ కలిపి ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా సమాధానం చెపుతారు తొందరపడొద్దు అని అన్నారు.

మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి అంటూ

గంటా శ్రీనివాసరావు గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే రాజకీయంలో ఆయనకి ఒక హుందాతనం ఉంది అని ఆయన ఎవరి ముందైనా ఒకేలా ఉంటారు అని ముందు తిట్టేసి వెనుక అన్నా మీరే దిక్కు అనే నైజం ఆయనది కాదు అని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.