సామాజిక భవనం కోసం వై వి సుబ్బారెడ్డికి వినతిపత్రం సమర్పించిన పలు సామాజిక వర్గ నాయకులు
ఎండాడ: వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 07:
విశాఖ జిల్లా ఎండాడ లా కాలేజ్ పనోరమ హిల్స్ పక్కన ఉన్న విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి ని మరియు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ని మర్యాద పూర్వకంగా కలసిన పలు వైసీపీ నాయకులు .ఈ సందర్భంగా నగరాలు సామాజిక వర్గం అఖిలపక్ష సభ్యులతో కలిసి నగరాల సామాజిక వర్గానికి సామాజిక అవసరాల కోసం సామాజిక భవనం మంజూరు చేయమని వినతి పత్రం సమర్పించిన రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లా సుజాత సత్యనారాయణ,.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా నగరాల సంఘం అధ్యక్షుడు పోతిన వెంకటరావు ( సుమన్ వెంకట్రావు) జిల్లా నగరాలు సంఘం కార్యదర్శి జగుపిల్లి అప్పలరాజు, కార్పొరేషన్ డైరెక్టర్లు కొరికాని మోహన్ రావు, వాండ్రాసి శ్యామల, కురిటి లోహిత్ మరియు వివిధ పార్టీలకు చెందిన నగరాల సామాజిక వర్గం నాయకులు పాల్గొన్నారు.
@@@@@
భీమిలి నియోజకవర్గం లో ఉన్న జోన్ టు పరిధిలోని 5,6, 7 వార్డులులకు సంభందించిన వెనుకబడిన కులలైన ఎస్.సి సభ్యులకు ఒక సామాజిక భవనం కావాలని రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి కి మరియు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి వినతి పత్రం సమర్పించారు....ఈ కార్యక్రమంలో కుడితి రామారావు, సింహాద్రి కనకరాజు ,కారపు బాబ్జి ,అప్పన్న,తదితరులు పాల్గొన్నారు..


